కల్వకుర్తి ఐటిఐలో ప్రింటింగ్ ఆపరేటర్ కోర్సు: దరఖాస్తులకు ఆహ్వానం

240చూసినవారు
కల్వకుర్తి ఐటిఐలో ప్రింటింగ్ ఆపరేటర్ కోర్సు: దరఖాస్తులకు ఆహ్వానం
కల్వకుర్తి ప్రభుత్వ ఐటిఐ/ఏటీసీ కళాశాలలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY4.0) పథకం కింద ప్రింటింగ్ ఆపరేటర్ షార్ట్ టర్మ్ కోర్సును అందిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ ఉత్తీర్ణతతో పాటు 18 ఏళ్లు నిండిన వారు ఈ కోర్సుకు అర్హులు. జనవరి 5, 2026న కోర్సు ప్రారంభం కానుంది. ఆసక్తి గలవారు జనవరి 3వ తేదీలోపు ఎస్ఎస్సీ, ఆధార్ కార్డు ధ్రువపత్రాలతో కల్వకుర్తి ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ కే. జయమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్