నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో జీవించి ఉన్న రైతును మృతుడిగా చూపించి భూమి రికార్డులు మార్చిన ఘటనపై శనివారం కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కఠిన చర్యలు చేపట్టారు. విచారణలో నిర్లక్ష్యం వెలుగులోకి రావడంతో భూభారతి ఆపరేటర్ మూడవత్ జైపాల్ను విధుల నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పటి డిప్యూటీ తహశీల్దార్ ఎ. అశోక్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.