అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన మహిళ

0చూసినవారు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన మహిళ
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో లట్టుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఓ మహిళ అమెరికా నుంచి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన ఈ స్థానం కోసం అన్ని పార్టీల వారు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గ్రామానికి చెందిన కమతం శ్రీనివాస్ రెడ్డి భార్య నందిని, పిల్లలు అమెరికాలో స్థిరపడటంతో గత ఆరేళ్లుగా అక్కడే నివసిస్తూ, అప్పుడప్పుడు స్వగ్రామానికి వస్తూ వెళ్తోంది.

సంబంధిత పోస్ట్