Apr 17, 2026, 11:04 IST/
రాహుల్ గాంధీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
Apr 17, 2026, 11:04 IST
ద్వంద్వ పౌరసత్వం అంశంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని లఖ్నవూ బెంచ్ సూచించింది. ఈ విచారణను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని లేదా ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోర్టు పేర్కొంది. ఈ ఆదేశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.