May 10, 2026, 14:05 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
ఊర్కొండలో ఉరుములు, మెరుపులతో వర్షం
May 10, 2026, 14:05 IST
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఊర్కొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది.