Nov 12, 2025, 18:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
రేవంత్ రెడ్డి మరోఐదేళ్లు సీఎంగా కొనసాగాలి: స్పీకర్ జి. ప్రసాద్
Nov 12, 2025, 18:11 IST
బుధవారం చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాలన కొనసాగిస్తుందని, ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు అవుతాయని వెల్లడించారు. ఈ ఐదు సంవత్సరాలే కాదు, మరో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి రాయుని దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు.