వనపర్తి జిల్లా పెబ్బేర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అదనపు మౌలిక వసతుల నిర్మాణానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. 10వ తరగతిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పటిష్టపరిచేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.