Apr 17, 2026, 10:04 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం
నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
Apr 17, 2026, 10:04 IST
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గేట్ సమీపంలో శుక్రవారం హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లేపల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వైపు వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.