దశాబ్దాల దాహానికి ముగింపు

1చూసినవారు
దశాబ్దాల దాహానికి ముగింపు
నేరేడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి గ్రామంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ చొరవతో పరిష్కారం లభించింది. సర్పంచ్ బాబురామ్ నాయక్ ఆధ్వర్యంలో కొత్తగా మంచినీటి బోర్ ఏర్పాటు చేయడంతో గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఎండకాలంలో కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే మహిళలు, వృద్ధులు, పిల్లల కష్టాలు తీరాయి. ఎమ్మెల్యే చొరవతో శాశ్వత పరిష్కారం లభించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you