భువనగిరి రైల్వే స్టేషన్లో మంగళవారం రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన మొహమ్మద్ బాషా మృతి చెందారు. ఆయన గతంలో ఖమ్మంలోని ఓ కళాశాలలో ఫ్యాకల్టీగా (MBA, PhD) పనిచేశారు. బాషా మృతితో బనిగండ్లపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.