నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామ వాసి. చేనేత కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ కుటుంబం 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో స్థిరపడింది. ఆయన తండ్రి నరహరి ప్రస్తుతం హైదరాబాద్ లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి నల్గొండ కలెక్టర్ కావడం విశేషం.