యాదాద్రి జిల్లా బీబీనగర్ పట్టణంలోని మహాత్మ గాంధీ జ్యోతిరావు ఫూలే సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఆదివారం విద్యార్థులతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.