యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గణేశ్ అనే యువకుడు మృతి చెందాడు. తండ్రి నెల మాసీకం కోసం సామగ్రి తీసుకొచ్చి తిరిగి వెళ్తుండగా, మాందాపురం గ్రామ పరిధిలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలైన గణేశ్‌ను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.