May 21, 2026, 16:05 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం
ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపు
May 21, 2026, 16:05 IST
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు గురువారం జరిగింది. 55 రోజులకు గాను రూ. 9,72,755 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ మాజీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ బి. సుమతి, కార్యనిర్వణాధికారి అంబటి నాగిరెడ్డి, సర్పంచ్ ఆర్. శేఖర్, గ్రామ కార్యదర్శి డి. పద్మ, భక్తులు పాల్గొన్నారు. ముఖ్య అర్చకులు ఎన్. మల్లాచారి, సిహెచ్ శ్రవణ్ కుమారాచార్యులు, జి. ఉమామహేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.