నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి హనుమాన్ గుడిలో పని చేసే పూజారి రూ.1 లక్ష ఇచ్చాడు. సమయానికి చెల్లించకపోవడంతో.. పూజారి తనకున్న పలుకుబడితో చిట్యాల పోలీసుల నుంచి సదరు వ్యక్తి పై ఒత్తిడి చేశాడు. త్వరలో చెల్లిస్తానని చెప్పినా పోలీసులు వినడం లేదని, కానిస్టేబుల్స్ తనతో దురుసుగా మాట్లాడాడని బాధితుడు తెలిపాడు. సివిల్ పంచాయతీలో తలదూర్చవద్దని చెప్పినా పోలీసులు ఇన్ వాల్వ్ కావడంతో.. పోలీసుల పై చర్యలు తీసుకోవాలని బాధితుడు జిల్లా ఎస్పీని కోరుతున్నాడు.