
విద్యార్దుల డ్రాపౌట్స్ తగ్గిస్తా, సమస్యలు పరిష్కరిస్తా: సర్పంచ్ అభ్యర్ది బైకాని శ్రీశైలం యాదవ్
వెలిమినేడు గ్రామాభివృద్ది కోసం తనను సర్పంచ్ గా కత్తెర గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ది బైకాని శ్రీశైలం యాదవ్ కోరారు. వెలిమినేడులో విద్యార్దుల డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నాయని, అందరూ చదువుకునేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. హైస్కూల్ లో మోడరన్ వాలీబాల్ క్రీడా గ్రౌండ్ ను తన సొంత నిధులతో నిర్మిస్తానని శ్రీశైలం యాదవ్ అన్నారు. హైస్కూల్ లో టాయిలెట్స్, వాటర్ సమస్యను కూడా పరిష్కరిస్తానన్నారు.


















