
డిండి ఎత్తిపోతల నిర్వాసితులకు అండగా పోరాడుతా
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం, పునరావాస పథకాలు అందేవరకు వారికి అండగా ఉంటానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో నిర్వాసితులతో సమావేశమైన కవిత, వారి గోడు విని కన్నీళ్లు పెట్టుకున్న బాధితులను ఓదార్చి, తప్పకుండా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.







































