డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన ముగ్గురు గొర్రెల కాపర్లు, బద్దెల వెంకటయ్య, రగడంపల్లి పెద్దయ్య, సిగ వెంకటయ్య 10 రోజుల క్రితం 300 గొర్రెలు, మేకలను మేపుకు రావడానికి అడవికెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో డిండి (దుందుభి) వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వారు వాగు మధ్యలో ఉన్న మట్టి దిబ్బపై చిక్కుకున్నారు. చుట్టూ వరద నీరు ప్రవహిస్తుండటంతో, వెంట తీసుకెళ్లిన సరుకులు అయిపోవడంతో గ్రామస్తులు డిండి తహసీల్దార్‌కు సమాచారమిచ్చారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు డ్రోన్ సాయంతో గొర్రెల కాపర్లకు నిత్యావసర సరుకులు పంపారు.