ఈ నెల 6న నల్గొండ జిల్లా, దేవరకొండ మున్సిపాలిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఆయన రాక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం పరిశీలించారు. కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షించి, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న పనులు, హెలిపాడ్, బహిరంగ సభ వంటి అంశాలపై చర్చించారు.