దేవరకొండ నియోజకవర్గంలో పీఏపల్లి మండలంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని బాలునాయక్ అనడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు యెలుగురి వల్లపు రెడ్డి బుధవారం అన్నారు. సాగర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి అంగడిపేట వరకు రూ. 1.95 కోట్లతో రోడ్డు నిర్మాణం, అంగడిపేట నుంచి గుడిపల్లి మీదుగా నల్గొండ లింక్ ఆర్ అండ్ బి రోడ్డు, గుడిపల్లి నుండి కేశనేనిపల్లె నర్సింగ్ బాయి వరకు బీటీ రోడ్డు, పీఏపల్లి నుంచి మునావత్ తండా బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. బాలు నాయక్ తక్షణమే రాజీనామా చేయాలని వల్లపు రెడ్డి డిమాండ్ చేశారు.