రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష

1చూసినవారు
రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. చింతపల్లి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బీఎస్పీ మండలాధ్యక్షుడు ముదిగొండ మొగిలయ్య, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్