చింతపల్లి క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఏఎస్పీ మౌనిక అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండలస్థాయి కబడ్డీ పోటీలను ఆమె ప్రారంభించారు. మొత్తం 22 టీంలు పోటీలలో పాల్గొనగా వాటికి ప్రణవ గ్రూప్ రవి జెర్సీలు, షీల్డ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నవీన్, ఎస్ఐ యాదయ్య, తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, తదితరులు పాల్గొన్నారు.