వర్కాల గ్రామ రైతులకు నష్టపరిహారం పంపిణీ

0చూసినవారు
వర్కాల గ్రామ రైతులకు నష్టపరిహారం పంపిణీ
చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన 15 మంది రైతులకు శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ రూ. 3 కోట్ల 4 లక్షల 50 వేల విలువైన నష్టపరిహార చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ, భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా నష్టపరిహారం అందిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్