దేవరకొండ: పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్ హాల్ లో మంగళవారం సిపిఐ నల్గొండ జిల్లా 23వ మహాసభలు జరుగనున్నాయి. మహాసభల కోసం సోమవారం పార్టీ శ్రేణులు పార్టీ తోరణాలు జెండాలతో పట్టణాన్ని ఎరుపు మయం చేశారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు వెంకటరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ సత్యం తదితర నేతలు హాజరుకానున్నారు.