ఈ నెల 15న దేవరకొండలో జరిగే సిపిఐ నల్లగొండ జిల్లా 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో జరిగిన దేవరకొండ, చందంపేట, కొండమల్లేపల్లి, పిఏ పల్లి, నేరేడుగొమ్ము, గుడిపల్లి మండలాల కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సుదర్శన్ రెడ్డి, వెంకటయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, అచ్చయ్య, జయరాములు తదితరులు పాల్గొన్నారు.