నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువుగా నమోదువుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులతోపాటు మరణాలు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు క్యాన్సర్ పై సరైన అవగాహన లేక చివరిస్టేజీ వచ్చేదాకా క్యాన్సర్ ను గుర్తించలేకపోతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించి, తగు చర్యలు చేపడితే క్యాన్సర్ కేసులు, మరణాలు తగ్గించవచ్చు.