దేవరకొండ: అర్హులందరికీ సంక్షేమ పథకాలు

54చూసినవారు
దేవరకొండ: అర్హులందరికీ సంక్షేమ పథకాలు
దేవరకొండ: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం మైనంపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమణారెడ్డి నాయకులు అలంపల్లి, రాoసింగ్ గౌతమి, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్