విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించి, విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఆ సంఘం నేత సాయి అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన ఏబీవీపీ 77వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు గోపీచంద్, హేమ సుందర్, నరేష్, రాకేష్, సాయి, కావ్య, శ్రావణి, శిరీష, తులసి రామ్, తదితరులు పాల్గొన్నారు.