దేవరకొండ: మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్

79చూసినవారు
దేవరకొండ: మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్
దేవరకొండ మండల పరిధిలోని అంబటివానిగూడెంకు చెందిన దయాకర్ అనే వ్యక్తి లోకల్ ఆటోలో ప్రయాణించి దిగే సమయంలో తనవెంట తెచ్చుకున్న నలభై వేల రూపాయలు, పట్టదారు పాస్ బుక్ ను ఆటోలో మర్చిపోయాడు. నగదు, పాస్ బుక్ గుర్తించిన ఆటో డ్రైవర్ భీమ్ సింగ్ నాయక్ ఆదివారం వాటిని పోగొట్టుకున్న దయాకర్ ను పిలిచి ఆటో డ్రైవర్ల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా భీమ్ సింగ్ నాయక్ ని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్