దేవరకొండ డాక్టర్ రాములు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం.. ధనావత్ భాస్కర్ నాయక్

189చూసినవారు
దేవరకొండ డాక్టర్ రాములు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం..  ధనావత్ భాస్కర్ నాయక్
దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్ మాజీ సుపిరిడెంట్ డాక్టర్ నేనావత్ రాములు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని నాగార్జున సాగర్ బంజారా సేవసంఘం ఉప అధ్యక్షుడు ధనావత్ భాస్కర్ నాయక్ అన్నారు. ఆదివారం వారి ప్రథమ వర్ధంతి వేడుకలు సందర్భంగా, రాములు నాయక్ తనయుడితో కలిసి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. రాములు నాయక్ వైద్య సేవలు ఆదర్శంగా యువత వైద్య రంగాల్లో రాణించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాండు నాయక్, మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్