దేవరకొండ తాలూక కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ ఎమ్మెల్యే దివంగత కామ్రేడ్ రామశర్మ జీవితం ఆదర్శప్రాయమని ఎమ్మెల్సీ సత్యం సీపీఐ రాష్ట్ర నేత నరసింహారెడ్డిలు అన్నారు. ఆదివారం రామశర్మ 8వ వర్ధంతిని దేవరకొండలో సీపీఐ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, రామస్వామి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.