గుండ్లపల్లి మండలం వావిల్కోల్, రుద్రయిగూడెం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటానికి రుద్రాయగూడెం గ్రామానికి చెందిన దొంతినేని రాజేశ్వరరావు 2 లక్షల 50 వేలను పోలీసులకు మంగళవారం అందజేశారు. గ్రామ సర్పంచ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గుండ్లపల్లి ఎస్సై బాలకృష్ణ మాట్లాడుతూ, నేర నియంత్రణ, నేరాలను కనిపెట్టడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగమనీ, అన్ని గ్రామాల్లో సీ. సీ. కెమెరాలను ప్రజల సహకారంతో ఎర్పాటు చేస్తామని తెలిపారు.