సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగు జలాలు అందించే రాచకొండ రిజర్వాయర్‌కు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం సంస్థాన్ నారాయణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. పాలకులు మారినా ఎస్‌ఎల్‌బీసీ, డిండీ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు.