ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి

0చూసినవారు
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటర్ల జాబితా సవరణ విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచే వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్