నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ బుధవారం సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి, హామీల అమలు, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ముఖ్యమంత్రి కేవలం
కేటీఆర్, కెసిఆర్ లపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం తప్పకుండా చెబుతారని ఆయన హెచ్చరించారు.