రూ.67,500 పలికిన వినాయకుని లడ్డూ

0చూసినవారు
రూ.67,500 పలికిన వినాయకుని లడ్డూ
హరిజనాపురం గ్రామంలోని మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. భక్తుల సమక్షంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు భక్తులు ఆసక్తిగా పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో ముస్కు ఆంజనేయులు రూ. 67, 500లకు వినాయకుని లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆంజనేయులను అభినందించారు. వేలం పాట సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వినాయకుని ఆశీస్సులతో గ్రామ ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్