దేవరకొండలో ఆల్
ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జంతుక లింగం, ఉపాధ్యక్షులు బోయిని చంద్రమౌళి లను ఘనంగా సన్మానించారు. వారికి శాలువాలు కప్పి, డా. బి. ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను బహుకరించారు. సామాజిక సమానత్వం, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని, అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాత్రికేయులు ముందుండాలని ఆల్
ఇండియా సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దళితరత్న డా. బుర్రి వెంకన్న తెలిపారు.