సీపీఐ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 30న నల్గొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కొండమల్లేపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం, ఫ్యూడల్ సంస్థానాల విముక్తి కోసం వేలాది మంది ప్రాణాలను కోల్పోయిన ఏకైక పార్టీ సీపీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి, శేఖరాచారి, తదితరులు పాల్గొన్నారు.