పంచాయతీ ఎన్నికల మూడో విడత నోటిఫికేషన్‌

1చూసినవారు
పంచాయతీ ఎన్నికల మూడో విడత నోటిఫికేషన్‌
పంచాయతీ ఎన్నికల మూడో విడత నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది. దేవరకొండ డివిజన్‌ పరిధిలోని 9 మండలాల్లో 269 పంచాయతీలు, 2,206 వార్డు స్థానాలకు సంబంధించి నేటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణకు గాను డివిజన్‌ వ్యాప్తంగా 70 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. తొలి విడత నల్లగొండ, చండూరు డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా, రెండవ విడుత మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో ఎన్నికల నిర్వహణకు గాను మంగళవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. మూడో విడతలో దేవరకొండ డివిజన్‌లో నామినేషన్ల స్వీకరణ 5వ తేదీన పూర్తికానుంది.

సంబంధిత పోస్ట్