వరి ధాన్యం ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి

2చూసినవారు
వరి ధాన్యం ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం ధోనియాల గ్రామ పరిసరాల్లో ఇటీవల సంభవించిన తుఫాను బీభత్సానికి దెబ్బతిన్న పంటలను శనివారం ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. ఈ తుఫాన్ కారణంగా పొలాల్లో నీరు నిలిచిపోయి కోతకు వచ్చిన ధాన్యం, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతుల దీనస్థితిని ఆమె తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్న ఎంపీ, జరిగిన నష్టాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని, నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్