
కార్గో సర్వీసెస్లో ఎయిరిండియాకు అవార్డు
హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా కార్యక్రమంలో పలు ఎయిర్లైన్స్ సంస్థలు, విమానాశ్రయాలకు అవార్డులు లభించాయి. కార్గో సర్వీసెస్ విభాగంలో ఎయిరిండియా ఉత్తమ అవార్డును సొంతం చేసుకుంది. ఢిల్లీ, బెంగళూరు, లక్నో విమానాశ్రయాలు ఉత్తమ విమానాశ్రయాలుగా ఎంపికయ్యాయి. ఈ పురస్కారాలను కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అందజేశారు.




