నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలోని దివ్యాంగులకు సహాయ పరికరాలు అందించేందుకు సెప్టెంబర్ 30న దేవరకొండ పట్టణంలోని గిరిజన భవనంలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆదివారం తెలిపారు. శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, యూడిఐడి కార్డు, రేషన్ కార్డ్, పాస్ సైజ్ ఫోటో వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ శిబిరం ఆలిన్ కో సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది.