
బావిలో పడిన నాలుగు ఏనుగులు (వీడియో)
ఛత్తీస్‌గఢ్‌లోని బర్నవాపారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో, హార్దీ గ్రామంలోని ఓపెన్ బావిలో నాలుగు ఏనుగులు ప్రమాదవశాత్తూ పడిపోయాయి. స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో, అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఏనుగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి అరుణ్‌కుమార్ పాండే తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, అటవీ విభాగాల్లో ఓపెన్ బావులు లేకుండా చూసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.




