నేరేడుగొమ్ము మండలం పేర్వాలలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన సమతుల ఆహారం, సిరి ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.