దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పని తీరు, స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్ విభాగం, లాక్ అప్, ఎస్. హెచ్. ఓ గది తదితర విభాగాలను జిల్లా ఎస్పీ పరిశీలించి, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న మరియు కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ఎటువంటి అలసత్వం వహించరాదని సూచించారు.