మరణానంతరం కూడా తన చూపుతో మరొకరి జీవితంలో వెలుగులు నింపారు నల్గొండకి చెందిన తాళ్ళపల్లి చంద్రకళ (78). మహాలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో నివసించే ఆమె శుక్రవారం కన్నుమూశారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను చాటుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆమె నేత్రాలను దానం చేశారు. ఇప్పటివరకు 342 మంది నుంచి నేత్రాలను సేకరించి, 684 మందికి చూపునిచ్చారు.