
కోదాడ: గుడిబండ గ్రామ సర్పంచ్ పదవికి అధిష్టానం అవకాశం ఇవ్వాలి
కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు అవకాశం ఇవ్వాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు తిరుపతి బాబు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎంపీ వైద్యునిగా ప్రజలకు సేవలు అందించి, కరోనా సమయంలో సహాయం చేసినట్టు తెలిపారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, సర్పంచ్ అవకాశం లభిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.




































