కోదాడలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 140వ నేత్రదానం కార్యక్రమం గురువారం జరిగింది. మరణించిన ఓరుగంటి అప్పయ్య సతీమణి ఓరుగంటి జయలక్ష్మమ్మ కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి నేత్రాలను ఖమ్మం నేత్రనిధి ప్రతినిధులు సేకరించారు. ఈ నేత్రదానం ద్వారా ఆరుగురు దృష్టి లోపం ఉన్న వారికి చూపు లభిస్తుందని ట్రస్ట్ బాధ్యులు పైడిమర్రి సుధాకర్ తెలిపారు. ఓరుగంటి ప్రభాకర్ అంగీకారంతో ఈ ప్రక్రియ పూర్తయింది.