ముస్కు శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపిన దొంతగాని

2306చూసినవారు
ముస్కు శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపిన దొంతగాని
అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికైన ముస్కు శ్రీనివాస్ రెడ్డిని సీనియర్ నాయకుడు దొంతగాని అంజయ్య గౌడ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. శ్రీనివాస్ రెడ్డి రెండోసారి ఎన్నిక కావడం కార్యకర్తల విశ్వాసానికి నిదర్శనమని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అంజయ్య గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్