పల్లె దవాఖానాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

1927చూసినవారు
పల్లె దవాఖానాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
చిలుకూరు మండలం దుదియాతండా గ్రామంలో టీజీఎంఐడీసీ నిధుల ద్వారా రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానాను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ ఆరోగ్య సేవల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.